top of page

ఆశా వర్కర్స్ అరెస్ట్ విడుదల

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 22, 2022
  • 1 min read

విశాఖపట్నం ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, వైజాగ్ జిల్లా వైద్యాధికారి కార్యాలయం వద్ద నిరసన తెలపడానికి వెళుతున్న పెదగంట్యాడ పి.హెచ్.సి ఆశ వర్కర్స్ 31 మందిని పోలీసులు అరెస్టు చేశారు వారు వెళుతున్న బస్సులు ఆటోలు దించేసి బలవంతంగా న్యూ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు, కొంతమంది ఆశ వర్కర్స్ ని వారి ఇళ్ల దగ్గరే హౌస్ అరెస్టు చేశారు. తీసుకుని దీనికి నిరసనగా పోలీస్ స్టేషన్ ముందు ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొవిరి అప్పలరాజు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్స్ ని బలవంతంగా అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. 11 వ పి ఆర్ సి లో ఆశ వర్కర్స్ వేతనం 15 వేలకు పెంచాలని, ఆశా వర్కర్స్ పై పని ఒత్తిడి తగ్గించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని, ఆశా వర్కర్స్ ని రెగ్యులరైజ్ చేయాలని, వారికి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హేమలత కుమారి సోమేశ్వరి రేణుక తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేసిన ఆశా వర్కర్స్ ని సాయంత్రం మూడున్నర గంటలకు విడుదల చేశారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page