top of page

అంతర్జాతీయ విమానాల రాకను ఎన్నికల టిడిపి మేనిఫెస్టోలో చేర్చాలి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 2, 2024
  • 1 min read

అంతర్జాతీయ విమానాల రాకను ఎన్నికల టిడిపి మేనిఫెస్టోలో చేర్చాలి

వినతి పత్రం అందజేస్తున్న రాయలసీమ అంతర్జాతీయ విమానాశ్రయ సాధన సమితి సభ్యులు

జీవనాధారం కోసం లక్షలాది మంది తెలుగువారు గల్ఫ్ దేశాల్లో ఉన్నారని, వారి సౌలభ్యం కోసం రేణిగుంట లేక కడప విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాల సర్వీసులను నడపాలని రాయలసీమ అంతర్జాతీయ విమానాశ్రయ సాధన సమితి సభ్యులు కోరారు. శనివారం తెలుగుదేశం పార్టీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి ని నేడు కువైట్ నందు కలిసి వినతి పత్రం ఇచ్చారు.రానున్న టిడిపి ఎన్నికల మేనిఫెస్టో లో ఈ అంశాన్ని అజెండాగా చేర్చాలని కోరారు. ఈ దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, కనీసం వారానికి ఒక్కసారైనా అంతర్జాతీయ విమాన రాకపోకలు జరిగేటట్లు చూడాలన్నారు.ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మాస్ మీడియా మస్తాన్, ఏపీ యంగ్ లీడర్స్ అసలం షేక్, ఎన్ఆర్ఐ టిడిపి మైనారిటీ వింగ్ ఆస్మా ముస్తఫా, బెహన్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడు రఫీ ఖాజా, అమ్రాజ్ భాష షేక్ జిక్రియా తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page