మున్సిపల్ మేనేజ్మెంట్ సర్ ప్లస్ టీచర్లను మున్సిపల్ హైస్కూల్ ఖాళీలలోనే సర్దుబాటు చేయాలి - ఎస్టిఎఫ్
- VOICE OF HERALD

- Jul 10
- 1 min read
మున్సిపల్ మేనేజ్మెంట్ సర్ ప్లస్ టీచర్లను మున్సిపల్ హైస్కూల్ ఖాళీలలోనే సర్దుబాటు చేయాలి - ఎస్టిఎఫ్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరులో మున్సిపల్ మేనేజ్‌మెంట్ సర్‌ప్లస్ ఉపాధ్యాయుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌టీఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయం ప్రొద్దుటూరు ఎదుట ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. మున్సిపల్ హైస్కూల్‌లలో ఉన్న ఖాళీల్లోనే తమను సర్దుబాటు చేయాలని, ఇతర పాఠశాలలకు బదిలీ చేయవద్దని వారు అధికారులను కోరారు.
2025 డీఎస్సీ ద్వారా మెరిట్ ఆధారంగా మున్సిపల్ పాఠశాలల్లో నియామకం పొందిన ఉపాధ్యాయులను సర్‌ప్లస్ పేరుతో ఇతర చోట్లకు పంపడం అన్యాయమని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ హైస్కూల్‌లలో ఉపాధ్యాయుల కొరత ఉన్నప్పటికీ, అక్కడి నుంచి తమను తొలగించడం వల్ల విద్యార్థుల చదువుపై ప్రభావం పడుతుందని తెలిపారు. తాము సెలవులు లేకుండా, ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తూ విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం కృషి చేశామని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. తమ సేవలను గుర్తించి, మున్సిపల్ హైస్కూల్‌లలోని ఖాళీల్లోనే సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ, డిప్యూటీ ఈఓలను కోరారు. డిమాండ్లను ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఎస్‌టీఎఫ్ నాయకులు విజ్ఞప్తి చేశారు.




Comments