నేతన్న నేస్తం సహాయం కోసం ఆగస్టు 15 లోపు దరఖాస్తు చేసుకోండి - ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి
- VOICE OF HERALD

- 4 days ago
- 1 min read
నేతన్న నేస్తం సహాయం కోసం ఆగస్టు 15 లోపు దరఖాస్తు చేసుకోండి - ఎమ్మెల్యే కార్యాలయం విజ్ఞప్తి

ప్రొద్దుటూరు, కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు అందిస్తున్న నేతన్న నేస్తం పథకం ద్వారా 25,000/- రూపాయల సహాయం ఇంకా అందని ప్రొద్దుటూరు నియోజకవర్గ చేనేత సోదరులందరూ వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కార్యాలయం విజ్ఞప్తి చేసింది. ఈ నెల 15-08-2026 తేదీ లోపు మీ పరిధిలోని సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, ఆ తేదీ తర్వాత దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వ సహాయం వర్తించదని స్పష్టం చేసింది. అర్హులైన ప్రతి చేనేత కార్మికుడు ఈరోజు లేదా రేపటి లోపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సచివాలయంలో దరఖాస్తు సమర్పించాలని కోరారు.




Comments