top of page

రాజోలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ జనశక్తి విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

Writer: EDITOR
EDITOR
Sep 28
1 min read

ప్రొద్దుటూరులో రాజోలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీ జనశక్తి విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు

కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇంచార్జ్, రాజోలు నియోజకవర్గ శాసనసభ్యులు దేవా వరప్రసాద్‌ను ప్రొద్దుటూరులోని ఆర్‌అండ్‌బి (R&B) అతిథి గృహంలో ఏపీ జనశక్తి విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ (Reg. No. H.248 - జనసేన పార్టీ అనుబంధం) ప్రతినిధులు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన డైరీని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి, యూనియన్ ఆవిర్భావం, కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర నాయకత్వం చేసిన కృషి, జనసేన పార్టీ నాయకత్వం అందించిన తోడ్పాటును ఆయనకు వివరించారు. అలాగే జనసేన పార్టీ అనుబంధ గుర్తింపు పత్రాలను ఎమ్మెల్యేకు అందజేస్తూ, యూనియన్ కార్యకలాపాలకు ఆయన సహాయ సహకారాలు అందించాలని కోరారు.


దీనిపై శాసనసభ్యులు సానుకూలంగా స్పందిస్తూ, పార్టీ అనుబంధ కార్మిక విభాగమైనందున తన పూర్తి మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. నాయకులు అందజేసిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి, కార్మికుల సంక్షేమానికి ఏ విధంగా ఉపయోగపడగలరో ఆలోచించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు వై. చంద్రమోహన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సి. శ్రీనివాసులు, ప్రాంతీయ కార్యదర్శి జి. ప్రసాద్, ప్రాంతీయ ఉపాధ్యక్షుడు సిహెచ్. శ్రీనివాసులు, నాయకుడు సుబ్బు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page