top of page

16,17,18 తేదీలలో ఏపీ రైతు సంఘం రాష్ట్ర స్థాయి సమ్మేళనం

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 15, 2022
  • 1 min read

ఈ నెల 16 నుండి 18 వరకు తిరుపతి బైరాగి గందమనేని శివయ్య - కృష్ణారెడ్డి కళ్యాణ మండపంలో జరగనున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర సమ్మేళనం జయప్రదం చేయాలని ఏ పి రైతు సంఘం జిల్లా ఉపాడ్యక్షులు మలిశెట్టి రాహుల్, జతిన్ పిలుపునిచ్చారు.

మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్ర సమ్మేళనాల్లో రైతాంగ సమస్యలు - పాలక ప్రభుత్వాల వైఖరి, డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫారసులు - శాస్త్రీయంగా మద్దతు ధరల చట్టం, రైతాంగ పోరాటాలు - నాడు,నేడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు - రైతు భరోసా, నదుల అనుసంధానం - అంతర్ రాష్ట్ర వివాదాలు నీటిపారుదల ప్రాజెక్టులు, వ్యవసాయం పశుపోషణ - గ్రామీణ ఆర్థిక స్వావలంబన, కౌలు రైతులు, పంటల వారి సంఘాల నిర్మాణం- ఆవశ్యకత, వ్యవసాయ మార్కెట్లు, మద్దతు ధరలు, పంట ఉత్పత్తుల నిల్వ సరఫరాలో కార్పొరేట్ల నీతి, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం - నిర్వాసితుల సమస్యలు, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సంఘ సమ్మేళనాలకు... సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ,అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రావుల వెంకయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త ప్రొఫెసర్ సోమసుందర్, ఎస్ వి యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్, తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంతి, సామాజిక రాజకీయ విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ జి వెంకట నాయుడు, ప్రముఖ పాత్రికేయులు ఏ.అమరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ , ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె వి వి ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య, సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఏ రామానాయుడు తదితరులు హాజరుకానున్నారనీ మలిశెట్టి రాహుల్ పేర్కొన్నారు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page