top of page

ప్రేమ వేధింపులే అనూష ఆత్మహత్యకు కారణం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 25, 2022
  • 1 min read

వైఎస్సార్ జిల్లా


జిల్లాలో సంచలనం రేపిన అనూష అనే విద్యార్ధి మిస్సింగ్, అనుమానాస్పద మృతి కేసు ఛేదించిన పోలీసులు. ప్రేమ వ్యవహారమే అనూష ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్దారణ. మహేష్ అనే వ్యక్తి ప్రేమ వేధింపులు ఇతర కారణాలతో నీటిలో మునిగి బలవన్మరణానికి పాల్పడినట్లు పేర్కొన్న ఎస్పీ అన్బురాజన్.


బద్వేల్ లో అనూష మిససింగ్ కేసు ను అనూష తండ్రి బద్వేల్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీనిపై ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణ. సిద్దవఠం, నెల్లూరు, బద్వేల్ లో సిసి టివి ఫుటేజ్ పరిశీలించామని, సిద్దవఠం వద్ద పెన్నా నది ఒడ్డున 23 వ తేదీ అనూష శవం లబ్యమైందని తెలిపారు. సంఘటన స్థలంలో దొరికిన అనూష మృతదేహానికి అక్కడే పోస్ట్ మార్టం నిర్వహించామని, మృతురాలి శరీరంలో లోపల, బయట ఎటువంటి గాయాలు లేవని అన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని ఎస్పీ అన్బురాజన్ తెలియచేశారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page