బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా అంకిరెడ్డిపల్లి చరణ్ రెడ్డి నియామకం
- VOICE OF HERALD

- Jul 27
- 1 min read
బీజేపీ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా అంకిరెడ్డిపల్లి చరణ్ రెడ్డి నియామకం

భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరు నగరం-1 పరిధిలో భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) పట్టణ అధ్యక్షుడిగా అంకిరెడ్డిపల్లి చరణ్ రెడ్డిని నియమించడం జరిగింది. చరణ్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అంకితభావంతో సేవలందిస్తూ, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మరియు భారతీయ జనతా యువ మోర్చా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారు.
ఈ సందర్భంగా చరణ్ రెడ్డి మాట్లాడుతూ, తనపై పార్టీ నాయకత్వం ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీజేపీ సిద్ధాంతాలు, ఆశయాలను యువతలో మరింత బలంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని, యువతను పార్టీ వైపు ఆకర్షించి పార్టీని మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎన్. కుమారి , జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ భూమిరెడ్డి భాస్కర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అంకిరెడ్డి చిరంజీవి రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఉమ్మడిశెట్టి శ్రీనివాసులు, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు అఖిల, ప్రధాన కార్యదర్శి ముత్యాల శ్రీశ్రీ, కార్యదర్శి హరికృష్ణ, సీనియర్ నాయకులు చలపతిరావు, పరమేశ్వరరావు, అలాగే బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని చరణ్ రెడ్డికి అభినందనలు తెలిపారు.





Comments