top of page

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 19, 2023
  • 1 min read

అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అన్నప్రాసన

చిన్నారి అన్నప్రాశన కార్యక్రమంలో హనుమంతు రమేష్

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మున్సిపాలిటీలోని మన్నూరు అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పోషణ అభియాన్ పథకంలో భాగంగా సామాజిక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఎస్ ప్రాజెక్టు అసిస్టెంట్ హనుమంతు రమేష్ పాల్గొని ఆరు నెలలు నిండిన చిన్నారికి అన్నప్రాశన చేశారు. ఈ సందర్భంగా హనుమంతు రమేష్ మాట్లాడుతూ పిల్లలకు తల్లిపాలతో పాటు అదనపు పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు. ప్రభుత్వం అందజేసే బాలామృతం పిల్లలకు తప్పకుండా తినిపించాలని., ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయని తెలియజేశారు. పిల్లలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు చేయించి అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని సూచించారు.


Comments

Rated 0 out of 5 stars.
Couldn’t Load Comments
It looks like there was a technical problem. Try reconnecting or refreshing the page.
bottom of page