top of page

ఫస్ట్ నైట్ కి భయపడి సూసైడ్ చేసుకున్న నవ వరుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 21, 2022
  • 1 min read

ఫస్ట్ నైట్ కి భయపడి సూసైడ్ చేసుకున్న నవ వరుడు

ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జరిగింది. మాచర్లకు చెందిన కిరణ్ కుమార్ అనే యువకుడికి తెనాలికి చెందిన యువతితో ఈ నెల 11న వివాహం జరిగింది. 12వ తదీన వధువును తీసుకొని వరుడు మాచర్లకు వెళ్ళిపోయాడు. నాలుగు రోజుల తర్వాత 16వ తేదీన తెనాలిలో మొదటి రాత్రి ఏర్పాటు చేయడంతో భార్యను తీసుకొని మాచర్ల నుంచి తెనాలికి బయలుదేరాడు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుంటూరు బస్టాండుకు రాగానే ఇప్పుడే వస్తానని చెప్పి కనబడకుండా వెళ్లిపోయాడు. రాత్రి వరకు ఎదురు చూసిన నూతన వధువు తన బంధువులకు సమాచారమిచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ రావడంతో చేసేది లేక, చీకటి పడుతుందని తెనాలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా, కృష్ణా నది ఎగువన ఓ గుర్తు తెలియని మృతదేహం ఉందిన పోలీసులకు సమాచారం రావడంతో వారు శవాన్ని వెలికి తీశారు. జేబులో ఉన్న ఫోన్ సిమ్ తీసి బంధువులకు సమాచారమందించారు. మృతుడి తల్లి వచ్చి గుర్తు పట్టడంతో మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మొదటి రాత్రి అంటే తన కొడుకు భయపడ్డాడని, స్నేహితులు ఎంత ధైర్యం చెప్పినా ఆత్మ హత్య చేసుకొని తమకు, నూతన భార్యకు అన్యాయం చేశాడని అతని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page