top of page

పోలీసుల తక్షణ స్పందనతో ఓ రైలు ప్రయాణీకురాలికి ఊరట

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Oct 15, 2022
  • 1 min read

అనంతపురం పోలీసుల తక్షణ స్పందనతో

ఓ రైలు ప్రయాణీకురాలికి ఊరట


అనంతపురం


గొలుసు లాగే ప్రయత్నం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.


శనివారం తెల్లవారుజామున 5 గంటలకు అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసు కు ఓ మహిళ నుండీ ఫోన్ వచ్చింది. సాయినగర్ షిర్డీ నుండీ చెన్నై వెళ్లే రైలులో (ట్రైన్ నంబర్ 22602) S 12 కోచ్ లోని 45 వ బెర్త్ లో తాను ప్రయాణిస్తున్నాను ఓ గుర్తు తెలియని వ్యక్తి సాటి ప్రయాణీకుడిలా ఉంటూ తమను ఇబ్బంది పెట్టడమే కాకుండా తాను ధరించిన బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేశాడు. చర్యలు తీసుకోవాలని ఫోన్లో కోరింది.

డీఎస్పీ తక్షణమే స్పందించారు. త్రీటౌన్ సి.ఐ కత్తి శ్రీనివాసు లతో మాట్లాడి బ్లూకోల్ట్ సిబ్బందిని స్థానిక రైల్వే స్టేషన్ కు పంపారు రైలు స్థానిక రైల్వే స్టేషన్ కు రాగానే ఆ కోచ్ కు వెళ్లి మహిళను ఇబ్బంది పెట్టిన మరియు బంగారు గొలుసు లాగే ప్రయత్నం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు... పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page