top of page

విప్లవ వీరుడు అల్లూరి - మేడా

Writer: EDITOR
EDITOR
May 7, 2023
1 min read

విప్లవ వీరుడు అల్లూరి - మేడా

నివాళి అర్పిస్తున్న మేడా

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


స్వాతంత్ర సంగ్రామంలో విప్లవ జ్యోతిని రచించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని శాసన సభ్యులు మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం బైపాస్ లో గల ఎమ్మెల్యే కార్యాలయం నందు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడా మాట్లాడుతూ బ్రిటిష్ నియంతృత్వ పాలనలో బానిసలుగా మగ్గుతున్న ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం పోరాడి అసువులు బాసిన మన్యం వీరుడు, విప్లవయోధుడు, తెల్లదొరలను ఎదిరించి ప్రాణ త్యాగం చేసిన తెలుగు తల్లి బిడ్డడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో గ్రామీణ జెసిఎస్ కన్వీనర్ల ఇన్చార్జి మండలం గంగిరెడ్డి, సర్పంచ్ సూర్యనారాయణ, లక్ష్మీకర్ రెడ్డి, ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ హస్తవరం ఉమామహేశ్వర్ రెడ్డి, సర్పంచ్ మోహన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు సత్యాల రామకృష్ణ, పాటూరు శ్రీను, ముజఫర్ అహ్మద్, అబ్దుల్ కరీం, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page