top of page

మహా పాదయాత్రలో చిట్వేలి వైకాపా నాయకులు.

Writer: DORA SWAMY
DORA SWAMY
Dec 16, 2023
1 min read

మహా పాదయాత్రలో చిట్వేలి వైకాపా నాయకులు.

కలియుగ ప్రత్యక్ష దైవం, ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమల కు, మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి జిల్లాల జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి 21 వ సారి మహా పాదయాత్రగా భక్తజన సందోహంతో కలసి వస్తున్న సందర్భంగా ఓబులవారిపల్లి మండలం మంగంపేట వద్ద చిట్వేలి వైకాపా నాయకులు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులతో కలసి పాల్గొన్నారు.

మండల వైసీపీ కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు మెంబర్ మల్లిశెట్టి వెంకటరమణ, లింగం లక్ష్మీకర్ తదితరులు పాల్గొన్నారు. శాలువా, గజమాలతో ఆకేపాటి ని సత్కరించారు. మహా సంకల్పంతో ప్రతి ఏడాది మహాపాదయాత్ర ను పెద్ద ఎత్తున చేపట్టడం ఆకేపాటి కే చెల్లిందన్నారు. పాదయాత్ర సజావుగా సాగాలని ఆకాంక్షించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page