top of page

నేడే "ఆదిపురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 6, 2023
  • 1 min read

నేడే తిరుపతిలో "ఆదిపురుష్" ప్రీ రిలీజ్ ఈవెంట్.. ముఖ్యఅతిథిగా చిన్న జీయర్ స్వామి.

తిరుపతిలో వేడుక జరగబోతుందని స్పష్టం చేశారు. “ఆదిపురుష్” వాస్తవానికి జనవరి నెలలో విడుదల కావాల్సిన సినిమా. కానీ ప్రారంభంలో సినిమాలో గ్రాఫిక్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ సరిగ్గా లేకపోవడంతో… చాలా నెగెటివిటీ రావటం జరిగింది. “ఆదిపురుష్” ట్రైలర్ విడుదలైన సమయంలో భయంకరంగా ట్రోలింగ్ జరిగింది. దీంతో సినిమాని జూన్ నెలకి వాయిదా వేసి గ్రాఫిక్స్ వర్క్ మొత్తం మార్చి.. సరికొత్త మార్పులతో ఎఫెక్ట్స్ తో విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో “ఆదిపురుష్” రెండో ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారట. ఈ ట్రైలర్ లో రాముడు, రావణుడు మధ్య యుద్ధ సన్నివేశాలను చూపించనున్నట్లు సమాచారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page