top of page

తమిళ నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 22, 2023
  • 1 min read

తమిళ నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత ఆసుపత్రికి తరలింపు

తమిళ సీనియర్ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పినక్కర్లేదు తమిళ్ హీరో అయినప్పటికీ డబ్బింగ్ చిత్రాలు, డైరెక్ట తెలుగు చిత్రాలలో నటించడంతో తెలుగు వారికి కూడా సుపరిచితుడు. చంద్రముఖి, శక్తి, డార్లింగ్, చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ప్రభు ప్రస్తుతం ఇటు తెలుగు సినిమాలో అటు తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నా ప్రభు ఇక తాజాగా విడుదలైన వారసుడు చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాలతో బిజీగా ఉన్న ప్రభు మంగళవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యాడు చెన్నైలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని, ఆయన దగ్గర బంధువులు చెబుతున్నారు. ఆయన హాస్పిటల్లో చేరారని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page