top of page

జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 20, 2022
  • 1 min read

జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ

నెల్లూరు జిల్లా, కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం గ్రామం వద్ద ముంబై జాతీయ రహదారిపై తెల్లవారుజామున రెండు లారీలు ఢీ. డ్రైవర్ లకు తప్పిన ప్రాణాపాయం. నెల్లూరు నుంచి బుచ్చివైపు వెళుతున్న ట్రాన్స్పోర్ట్ లారీ బుచ్చి నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న సిమెంట్ మిక్సర్ లారీ వన్ వే లో వచ్చి ఎదురు ఎదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం లో క్యాబిన్ లో చిక్కుకున్న డ్రైవర్ను స్థానికులు పోలీసుల సహాయంతో బయటకు తీశారు. చికిత్స నిమిత్తం 108 లో ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page