top of page

తిరుపతి ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డు ప్ర‌మాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 18, 2023
  • 1 min read

తిరుపతి ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఇద్దరు మృతి, ఒకరికి తీవ్ర గాయాలు


తిరుప‌తి మొద‌టి ఘాట్ రోడ్డు లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోగా, మ‌రొక‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. అత‌ని ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంద‌ని వైద్యులు వెల్ల‌డించారు. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.


అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసిన స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page