top of page

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 25, 2023
  • 1 min read

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


రాజంపేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం డీ కొని వ్యక్తి మృతి చెందాడు....


అన్నమయ్య జిల్లా రాజంపేట ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై శనివారం తెల్లవారు జామున గుర్తు తెలియని వాహనం డీ కొని బైక్ పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు.మృతుడు పుల్లంపేట మండలం తిప్పాయి పల్లెకు చెందిన తిప్పన మోహన్ రెడ్డి(46) గా గుర్తించారు.మృతుడు మోహన్ రెడ్డి తిప్పాయపల్లె నుంచి తెల్లవారు జామున బెంగళూరు నుంచి వస్తున్న తన పెద్ద కుమార్తెను రిసీవ్ చేసుకునేందుకు వచ్చి మృత్యువాత పడ్డారు.ఈ ఘటనను వాకింగ్ కు వెళ్లిన వారు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్నీ పంచనామా నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page