top of page

కోకో పోటీలలో కొత్తపల్లె కే5 సచివాలయ విజేతలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2024
  • 1 min read

కోకో పోటీలలో కొత్తపల్లె కే5 సచివాలయ విజేతలు

కోకో విజేతలతో సర్పంచ్ కొనిరెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


రాష్ట్రవ్యాప్తంగా క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆడుదాం ఆంధ్ర' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండగా, శనివారం ఉదయం కొత్తపల్లి పంచాయతీ ఖాదరాబాద్ ఉన్నత పాఠశాల నందు కోకో క్రీడల పోటీలు నిర్వహించారు. పంచాయతీ పరిధిలోని అయిదు సచివాలయాల విద్యార్థులు పోటీలలో తలపడగా, చివరకు కే5 సచివాలయ విద్యార్థినిలు కోకో పోటీలలో గెలుపొందారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రారెడ్డి విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ, రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించి పంచాయతీకి మంచి పేరు తీసుకుని రావాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న పోటీలలో క్రీడాకారులకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తమ కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా వారికి ప్రోత్సాహకాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓ సావిత్రమ్మ, ఎంపీడీవో, వ్యాయామ ఉపాధ్యాయులు, పాటశాల లోని ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page