top of page

ఆడుదాం - ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి - ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 8, 2023
  • 1 min read

ఆడుదాం - ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయండి - ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి

ఉద్యోగులకు క్రీడా సామాగ్రి అందిస్తున్న ఎంపీపీ.

నందలూరు మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులకు ఆడుదాం ఆంధ్ర క్రీడా సామాగ్రి ను మండల అధ్యక్షుడు మేడ విజయ భాస్కర్ రెడ్డి, ఎంపిడిఓ సౌభాగ్యం చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగం లోని మానసిక ఒత్తిడిని జయించాలంటే క్రీడలు అవసరమనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్నారని అన్నారు. మండలంలోని యువత మరియు ఉద్యోగస్తులు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని, క్రీడలకు సంబంధించి నా పిట్లను శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు మరియు మండలంలోని అన్ని పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులకు అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా వక్స్ బోర్డ్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,మండల కో ఆప్షన్ సభ్యుడు కలిం, బి సి జిల్లా నాయుకుడు హిమగిరి నాథ్, మోహన్ రెడ్డి, సచివాలయ ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page