మోసాలకు కేరాఫ్ అడ్రస్ సునీల్ మొబైల్స్
- EDITOR

- Dec 24, 2021
- 1 min read

కడప నగరంలోని పాత బస్టాండ్ కాంప్లెక్స్ లోని కళ్యాణ్ జువెలర్స్ ఎదురుగా ఉన్న సునీల్ మొబైల్స్ మోసాలకు పాల్పడి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఎలాంటి రసీదు లు లేకుండా ఇష్టమెచ్చినట్లు బిల్లు వేసి సామాన్య ప్రజలను నడ్డి విరుస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన సెల్ ఫోన్స్ షాపు లు కడప నగరంలో వెలుస్తున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు మామూళ్లు మత్తులో జోగుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారి పై మొబైల్స్ షాప్ యాజమాన్యాలు భౌతిక దాడులకు దిగుతున్నారు. నీకు దిక్కుతోచిన చోట చెప్పుకోపో అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఇలాంటి మొబైల్స్ షాప్స్ యాజమాన్యాలు పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని కడప నగర వాసులు ఆరోపిస్తున్నారు.



Comments