top of page

ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 15, 2024
  • 1 min read

ఘనంగా 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నందు పంచాయతీ సెక్రెటరీ నరసింహులు ఆధ్వర్యంలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం వినూత్నమైన ఆలోచనతో పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించి వారికి కొబ్బరి నూనె, స్నానానికి సబ్బులు, డిటర్జెంట్స్ అలాగే హ్యాండ్ గ్లౌజులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆధ్వర్యంలో కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధి బాట పట్టనుందని, పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని, అందులో భాగంగానే డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖామాత్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయితీలలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకొనుటకు మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు 25వేల రూపాయలు కేటాయించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎంపీటీసీలు, పలువురు వార్డు మెంబర్లు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page