ఫారెస్ట్ అధికారుల మెరుపు దాడి: 234 కిలోల ఎర్రచందనం స్వాధీనం

లంకమల్ల అడవుల్లో ఫారెస్ట్ అధికారుల మెరుపు దాడి: 234 కిలోల ఎర్రచందనం స్వాధీనం

కడప జిల్లా అటవీ శాఖాధికారి అందించిన పక్కా సమాచారంతో ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అధికారులు లంకమల్ల రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నాగసానిపల్లి బీట్, చిక్కి తిప్ప ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. 08.10.2026 తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుండటాన్ని గమనించిన అటవీ సిబ్బంది స్మగ్లర్లపై మూకుమ్మడి దాడి చేశారు. అధికారులను చూసిన నిందితులు చెక్కలను అక్కడే పడవేసి చీకట్లో పరారయ్యారు.
ఘటనా స్థలంలో దాదాపు 234 కిలోల బరువు కలిగిన 7 చెక్కుడు చేసిన నాణ్యమైన ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అటవీ శాఖ క్షేత్రాధికారి ఎం. హేమాంజలి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, ఎర్రచందనం అక్రమ రవాణా లేదా స్మగ్లింగ్‌కు సంబంధించి ఎలాంటి అనుమానాస్పద సమాచారం ఉన్నా సమీపంలోని అటవీ శాఖ అధికారులకు వెంటనే తెలియజేయాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.





Comments