top of page

వైసిపికి రాజీనామా చేసిన 19వ వార్డు కౌన్సిలర్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 21, 2024
  • 1 min read

వైసిపి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన 19వ వార్డు కౌన్సిలర్

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాలలో మునిపెన్నడు లేని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కొన్ని పరిణామాలు అంతు చిక్కనప్పటికి, వైసీపీ అసంతృప్త నేతలలో ఒకరైన 19వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మునీర్ తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వివరాలు వెల్లడిస్తూ, ఈ నెల 7వ తేదీన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి తనను పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారని, అందులో వాస్తవం లేదని, వాస్తవానికి తాను ఈరోజు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. గడచిన కొంతకాలంగా వార్డులో అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని, తనకు విలువ లేని చోట ఇకపై తాను ఉండబోనని స్పష్టం చేస్తూ, రాజీనామా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు సురేష్ సురేష్ బాబుకు పంపనున్నట్లు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page