top of page

సర్పంచులకు శుభవార్త

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 13, 2024
  • 1 min read

సర్పంచులకు శుభవార్త

త్వరలో 15వ ఫైనాన్స్‌ నిధులు విడుదల కానున్న నేపథ్యంలో, కొన్నేళ్లుగా సమస్యలు, నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు మహర్దశ రానుంది. రెండు మూడు రోజుల్లో 2024-25 సంవత్సరానికి సంబంధించి 15వ ఫైనాన్స్‌ బేసిక్‌ గ్రాంట్‌ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల కానుంది. ఈమేరకు అధికారికంగా సమాచారం అందింది. అభివృద్ధి పనులు చేపట్టేందుకు సర్పంచులకు సువర్ణావకాశం లభించింది. ఈ నిధులతో పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుకోవచ్చు. ఈ నిధుల విడుదలకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి అలాగే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ కు జిల్లా సర్పంచుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసారు కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, వైఎస్సార్‌ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page