top of page

టిడ్లో ఇళ్ల అక్రమ కూల్చివేత

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 22, 2024
  • 1 min read

టిడ్లో ఇళ్ల అక్రమ కూల్చివేత

కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు పట్టణ శివారులో తెలుగుదేశం పార్టీలో దాదాపు 90 శాంతం నిర్మాణం పూర్తి చేసిన టిడ్కో ఇళ్లను కొంతమంది వ్యక్తులు హిటాచి వాహనాలతో నేలమట్టం చేశారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో జగనన్న స్మార్ట్ సిటీ నిర్మాణం చేపట్టాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల సమయంలో అధికారులు ఉన్నపలంగా 90 శాతం పూర్తి అయిన ఇళ్ల నిర్మాణాలను కుల్చివేయడం ఏంటని ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలనకు ఈ సంఘటన నిదర్శనంగా నిలుస్తుందని వరదరాజుల రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నామని వరదరాజుల రెడ్డి తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page