top of page

కడప రేణిగుంట జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 30, 2021
  • 1 min read

కడప రేణిగుంట జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం


లారీ కారు ఢీ నుజ్జు నుజ్జు అయినా కారు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు పరిస్థితి విషమం.

చిత్తూరు జిల్లా రేణిగుంట కడప జాతీయ రహదారి కుక్కలదొడ్డి వద్ద లారీ కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే రేణిగుంట వైపునుండి కోడూరు వెళ్తున్న కారు ముందు వెళ్తున్న లారీ ఓవర్ ట్రాక్ చేసి ఎదురుగా సిమెంట్ లోడుతో వస్తున్న లారీని ఢీకొంది దీంతో వెనకనే వస్తున్న లారీ కూడా కారును ఢీకొంది ఈ ప్రమాదంలో కారు నుజ్జూ నుజ్జు అయింది. కారులో ప్రయాణిస్తున్న ఐదు మంది లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురుకి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకున్న రేణిగుంట అర్బన్ సిఐ అంజు యాదవ్,ఎస్ఐ సునీల్,రక్షక్, డెమో సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page