top of page

మహిళలకు ఆర్థిక భరోసా వైయస్సార్ సున్నా వడ్డీ పథకం - కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Apr 22, 2022
  • 1 min read

మహిళలకు ఆర్థిక భరోసా వైయస్సార్ సున్నా వడ్డీ పథకం: కొరముట్ల

ఈరోజు ఉదయం రైల్వేకోడూరు తాహాసిల్దార్ కార్యాలయం నందు జరిగిన వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు హాజరయ్యారు. తాను మాట్లాడుతూ ఈ పథకం మహిళల్లో ఆర్థిక భరోసాను పెంపొందిస్తూ వారి కుటుంబాలకు ఆసరాగా ఉంటుందని, మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఇంటిల్లిపాది ప్రగతి పథం లో ఉంటుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడవదశ గా ఈరోజు ప్రారంభించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ భవాని, జెడ్పిటిసి రత్నమ్మ, ఏరియా కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్, మందల నాగేంద్ర, వైసిపి సీనియర్ నాయకులు ఎల్ వి మోహన్ రెడ్డి, స్వయం సహాయక సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page