top of page

సున్నా వడ్డీ పథకం మహిళలకు లబ్ది - వై. ప్రదీప్ రెడ్డి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 25, 2022
  • 1 min read

సున్నా వడ్డీ పథకం మహిళలకు లబ్ది - మెగా చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేసిన వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి.

మంత్రాలయం :

సున్నా వడ్డీ పథకం మహిళలకు లబ్ది అని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై. ప్రదీప్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన సున్నా వడ్డీ పథకం మెగా చెక్కు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా వెలుగు సిబ్బంది వై. ప్రదీప్ రెడ్డి కి పూలమాల వేసి శాలువ కప్పి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డ్వాక్రా మహిళలను ఉద్దేశించి వై. ప్రదీప్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్న తరుణంలో దీనిని జీర్ణించుకోలేని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఏపీ మరో శ్రీలంకగా మారుతుందని ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీనికి తోడు ప్రతి మహిళా సాధికారత సాధించాలని కోరారు. అనంతరం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కు సంబంధించిన మెగా చెక్కును డ్వాక్రా మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జి. భీమిరెడ్డి, ఏపీఎం జయశ్రీ సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, జడ్పీటీసీ సభ్యురాలు గోవిందమ్మ, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, చెట్నేహళ్లి సర్పంచ్ అంజిని,మాలపల్లి సర్పంచ్ సీతారామిరెడ్డి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, రామాంజనేయులు వార్డు సభ్యులు జగదీష్ స్వామి, వీరారెడ్డి నాయకులు జనార్దన్ రెడ్డి, వీకేసి రఘు, బద్రినాథ్ శెట్టి, దామోదర్ శెట్టి తదితరులు ఉన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page