top of page

కానపల్లె గ్రామంలో జోరుగా వైసీపీ ప్రచారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 12, 2024
  • 1 min read

కానపల్లె గ్రామంలో జోరుగా వైసీపీ ప్రచారం

ప్రచారంలో వైసీపీ ఎమ్మల్యే అభ్యర్థి రాచమల్లు

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండలం, కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లి గ్రామం నందు శుక్రవారం ఉదయం ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్రెడ్డి జోరుగా ఎన్నిక ప్రచారం సాగించారు. కానపల్లి గ్రామ వైసిపి నాయకులు బండి రమణారెడ్డి, దివంగత నేత మాజీ ఎమ్మెల్యే ఎంవిఆర్ తనయులు వైసిపి నాయకులు మల్లెల మురళీధర్ రెడ్డి, మల్లెల రాజారాంరెడ్డి, ఆప్కాబ్ చైర్మన్ ఝాన్సీ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన వైసిపి అభ్యర్థి రాచమల్లుకు ఇక్కడి నాయకులు కార్యకర్తలు గజమాలతో సన్మానం చేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు మాట్లాడుతూ, వైసిపి అభ్యర్థిగా తనను బలపరుస్తూ ఇక్కడి గ్రామ ప్రజలు ఆహ్వానించటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, రానున్న ఎన్నికలలో తనకు అలాగే కడప ఎంపీ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డికి ప్రజలు తమ అమూల్యమైన ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, రాచమల్లు అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page