top of page

విద్యా రంగానికి పెద్దపీట - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 18, 2023
  • 1 min read

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆరోపణలు మీరు సమర్థిస్తున్నారా?

  • సమర్ధిస్తున్నాం - YES

  • సమర్ధించటం లేదు - NO

విద్యా రంగానికి పెద్దపీట - రాచమల్లు

వైఎస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


బుధవారం ఉదయం ప్రొద్దుటూరు పాలిటెక్నికల్ కాలేజీ వద్దగల వైఎస్సార్ ఇంజనీరింగ్ కళాశాల అభివృద్ధి పనులలో భాగంగా సుమారు అరవై ఆరు కోట్ల రూపాయలతో వ్యయంతో జరగనున్న పనులకు నియోజకవర్గ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు రెడ్డి, రాష్ట్ర ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీ రాజా రామ్ రెడ్డి, పద్మశాలియ కార్పొరేషన్ చైర్ పర్సన్ జింకా విజయలక్ష్మి, ప్రొద్దుటూరు మండలాధ్యక్షుడు సాన బోయిన శేఖర్ యాదవ్, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, జిల్లా కన్వీనర్ కల్లూరు నాగేంద్ర రెడ్డి, గోపవరం పంచాయతీ సర్పంచ్ గద్దె మోష, ఉప సర్పంచ్ రాఘవేంద్రా రెడ్డి, వైయస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం, మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైఎస్ఆర్సిపి ముఖ్య నాయకులు, మహిళ నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page