top of page

జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన అభివృద్ధి - ఐ.ఏ.ఎస్ ఎం.టి కృష్ణ బాబు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 15, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దటూరు ఆర్ అండ్ బి అతిధి గృహంలో నేడు ఐ.ఏ.ఎస్ ఎం.టి కృష్ణ బాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ రోడ్డు, రవాణా మరియు భవనాలు శాఖ వారి ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి ఇంజినీర్స్, కాంట్రాక్టర్ల సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం వై.ఎస్.ఆర్ జిల్లా వ్యాప్తంగా పదిహేను వందల కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల గురించి ఆయన వివరించారు, ఇందులో భాగంగా దాదాపు 93.70 కోట్ల రూపాయల వ్యయంతో పునరుద్ధరణ పనులు పూర్తి చేశామని, ఇంకో 64.16 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయని, త్వరలో ఆరు కిలోమీటర్ల 1.99 కోట్ల రూపాయల రోడ్డు పనులు ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయని, గ్రాంట్ ద్వారా చేపట్టిన మరో నాలుగు పునరుద్ధరణ పనులు కూడా ఈ నెలాఖరుకు పూర్తి కానున్నాయని తెలిపారు.

విస్తరణలో భాగంగా ఇరవై ఎనిమిది రకాల పపనులు దాదాపు 479.44 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టామని, అందులో యెన్.డి.బి ఫేస్ 1 క్రింద జిల్లాలోని 72.49 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు గాను 202.22 కోట్ల రూపాయలు, యెన్.డి.బి ఫేస్ 2 క్రింద 121.624 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ పనులకు 321.86 కోట్ల రూపాయలు మంజూరు కాబడిందని తెలిపారు. సి.ఆర్.ఐ.ఫ్ పధకం క్రింద 66.40 కిలోమీటర్ల అభివృద్ధి పనులకుక్ 78.10 కోట్ల రూపాయలు, ఎస్.హెచ్ క్యాపిటల్ క్రింద 10.20 కిలోమీటర్లకు 37.50 కోట్లు, ఎం.డి.ఆర్ క్యాపిటల్, ఆర్.ఆర్. క్యాపిటల్, ప్లానింగ్ పధకాల క్రింద 183.43 కోట్ల రూపాయలు మంజూరు అయ్యిందని తెలిపారు.


జిల్లాలో ఎనిమిది వంతెనలకు మరమ్మత్తు పనులు కొనసాగుతున్నాయని అందుకుగాను 140.31 కోట్ల రూపాయల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇందులో భాగంగానే సి.కమ్మపల్లి, అట్లూరు, కమలాపురం లోని పగేరు నది వంతెన, బ్రాహ్మణపల్లి, రాయలాపురం, కుప్పం - కల్లూరుపల్లి వంతెన, మోపురి దేవళాలు ఆర్.ర్టీ.పీ.పీ రోడ్డు వంతెన నిర్మాణ పనులు చేపట్టారని తెలిపారు.


ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రాధాన్యతనిస్తూ కొత్తగా వెలుస్తున్న ఏడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు 13.18 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయగా, పాత కేంద్రాల మరమ్మత్తులకు గాను 26.11 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, అందులో కొన్ని అనివార్య కారణాల వలన నాలుగు కేంద్రాల్లో పనులు నిలిచిపోయాయని తెలిపారు. జిల్లాలోని కొన్ని ప్రధాన భవనాల నిర్మాణానికి 204.10 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా పనులు త్వరితగతిన జరుగుతున్నాయని ఆయన ఈ సందర్బంగా తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page