top of page

బంగారు పుష్పాలతో జగన్ చిత్రపటానికి అభిషేకం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 8, 2022
  • 1 min read

ఆంధ్రర్రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా కూడా తమ కుటుంబ సంక్షేమం కోసం ఎవరూ ఊహించని విధంగా ఉద్యోగులకు మేలు చేసే PRC ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ కు "బంగారు పుష్పాలతో" కృతజ్ఞతలు తెలిపిన శ్రీకాళహస్తి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు.


PRC పై జగన్ తీసుకున్న నిర్ణయంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి పట్టణం, పెళ్లి మండపం వద్ద జగన్ చిత్రపటానికి "బంగారు పుష్పాలతో" మరియు పాలతో అభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు.


ఈ సందర్భంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల PRCపై గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఎవరూ ఊహించినది అని, జగన్ గారు ఉద్యోగుల పక్షపాతి అని నిరూపించుకున్నారు అన్నారు. అలాగె రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంచడం సంతోషకరమని ఈ జనవరి నుంచి పెంచిన పిఆర్సి 5డీఏలు ఇస్తామనడం తమకు చాలా ఉపయోగపడుతుందని అన్నారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దిశగా ఆదేశాలు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page