top of page

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఖరారు?

  • Writer: EDITOR
    EDITOR
  • Aug 17, 2023
  • 1 min read

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిల ఖరారు?

ఇకపై ఏపీ నుండే తన రాజకీయ ప్రస్థానం మొదలు

కర్ణాటక నుండి రాజ్యసభకు షర్మిల

ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను ఖరారు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం సూచించినట్లే షర్మిల తన పార్టీని విలీనం చేయడంతో పాటు ఇకపై ఏపీ నుండే తన రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టేందుకు సిద్దమైనట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా పూర్తి కాగా ఇప్పుడు షర్మిల గ్రీన్ సిగ్నల్ తో ఈ విలీనం కథ సుఖాంతం కాబోతున్నట్లు సమాచారం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సిద్దమయ్యారా అంటే నిన్న మొన్నటి వరకూ ఏవేవో ఊహాగానాలు వినిపించాయి. షర్మిల పార్టీ విలీనానికి సిద్ధమే కానీ ఆమె రాజకీయాలు తెలంగాణలోనే ఉండాలని పట్టుబడుతున్నారని, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె రాకను వ్యతిరేకిస్తున్నారని, దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆమెను ఏపీకి వెళ్లాలని పట్టుబడుతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు వైఎస్ఆర్టీపీ, కాంగ్రెస్ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page