top of page

పేదల సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నతులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jul 8, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


పేదల సంక్షేమం కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నతులు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి - రాచమల్లు


డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి నివాళులర్పించిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

పేద ప్రజల సంక్షేమ కోసం తన జీవితాన్ని ధారపోసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మహానేత వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే రాచమల్లు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మహానేత వైఎస్ఆర్ అడుగుజాడల్లోనే నేడు ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నడుస్తూ పేదల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. నేడు, రేపు రెండు రోజులపాటు జరిగే మన వైసీపీ పార్టీ శ్రేణుల పండుగ స్టేట్ ప్లీనరీకి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page