top of page

టీడీపీలో యువకుల చేరిక - ప్రొద్దుటూరు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 24, 2022
  • 1 min read

టీడీపీలో యువకుల చేరిక


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి జి.వి ప్రవీణ్ రెడ్డి, తెలుగు యువత పట్టాణ అధ్యక్షుడు టి. భరత్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు ఆ పార్టీ కార్యాలయంలో అరవై మంది యువకులు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ తమ పార్టీలో యువకులకు ప్రాధాన్యత కల్పిస్తూ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారని, జాతీయ కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో రాబోవు ఎన్నికల్లో నలబై శాతం అసెంబ్లీ సీట్లు యువకులకు కేటాయించే దిశగా పార్టీ ముందుకు సాగుతోందని, ఇదే క్రమంలో తనను నియోజకవర్గ ఇంచార్జిగా భాద్యతలు అప్పగించారని, భగత్ సింగ్ కాలనీ, కాల్వ కట్ట ప్రాంతాల నుండి నేడు యువకులు తమ పార్టీలో చేరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేసి వారిని సాదరంగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. తాను ఉక్కు పోరాట దీక్షలు చేపట్టిన సమయంలో కూడా అధికంగా యువకులే తన వెంట నడిచారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. యువకులు సమాజానికి మేలు చేసే దిశగా అడుగులు వేయాలని హితువు పలికారు. పార్టీలో యువకుల చేరిక తనలో రెట్టింపు ఉత్సాహం తీసుకు వచ్చిందని, జిల్లా, నియోజకవర్గ సీనియర్లను ఎల్లవేళలా గౌరవిస్తూ వారి సూచన సలహాల మేరకు తన ఇంచార్జి పదవిని కొనసాగిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page