top of page

టీడీపీ వ్యాఖ్యలు ఖండించిన వైసీపీ నాయకుడు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 20, 2022
  • 1 min read

టీడీపీ వ్యాఖ్యలు ఖండించిన వైసీపీ నాయకుడు


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరులో కొందరు వైసీపీ నాయకులు రేగళ్ళపల్లె చెందిన సానేపల్లి గంగమ్మ కు చెందిన 5.45సెంట్ల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, నిన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జి జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి పత్రికా ముఖంగా ఆరోపణలు పెనుదుమారామే రేపగా, నేడు వైసీపీ నాయకుడు యాలం శంకర్, భూమి విక్రయించిన మూలే రామ లక్షుమ్మ ఇరువురు పై ఆరోపణలను ఖండించారు. గతంలో తమ కుమార్తె తనకు ప్రాణహాని ఉండటం చేత వాటాగా లభించిన భూమిని తమ పేరిట బదిలీ చేసిందని, అప్పులు తీర్చే క్రమంలోనే భూమిని యాలం శంకర్ కు విక్రయించానని తెలిపింది. ఇకనైనా టీడీపీ నాయకులు అబద్దపు ఆరోపణలు మానుకోవాలని హితువు పలికారు. యాలం శంకర్ మాట్లాడుతూ టీడీపీ నాయకుల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కోట్ల రూపాయల విలువ చేసే భూములు తాను కొనుగోలు చేయలేదని, తన కష్టార్జీతం ద్వారా సంపాదించిన డబ్బులతోనే భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న ప్రవీణ్ ఇకనైనా వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page