పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత. ఎన్సిసి అధికారి రాజశేఖర్.
- DORA SWAMY

- Jun 5, 2022
- 1 min read
చెట్లను పెంచడం తోనే పర్యావరణం సాధ్యం. పసుపుల రాజశేఖర్.

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. అన్నమయ్య జిల్లా చిట్వేల్ నందు జిల్లా ఉన్నత పాఠశాల ఎన్ సి సి అధికారి పసుపుల రాజశేఖర్ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో ఎన్సీసీ క్యాడేట్ల చేత చెట్లను నాటిస్తూ.. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మొక్కలను నాటడం,వాటిని సంరక్షించడం విధిగా చేపట్టాలని అలాంటప్పుడే కలుషితం లేని వాతావరణం మనకు అందుతుందని ఇదే భావితరాలకు మనం అందించే సంపద అని రాజశేఖర్ అన్నారు.ఈ సంవత్సరం పర్యావరణ దినోత్సవ నినాదం "ఒకే ఒక భూమి"అని సమస్త జీవకోటి మనుగడకు అవసరమైన గ్రహాలలో ప్రధానమైనది భూమి అని అట్టి భూమిని అనేక రకాల కాలుష్యాలతో కలుషితం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ వారన్నారు.

సీనియర్ ఎన్సిసి క్యాడెట్ పోలి చైత్ర మాట్లాడుతూ మనిషి ఎదిగేకొద్దీ పర్యావరణాన్ని మరచిపోతున్నాడని అతివృష్టి,అనావృష్టి ఇవన్నియు మానవ తప్పిదాలే నని, పర్యావరణంపై నిర్లక్ష్యాన్ని వదలి తెలియని వారికి కూడా తెలియపరచడం మనందరి బాధ్యత అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రాజు, వెల్ఫేర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం, ఎన్ సి సి సీనియర్ జూనియర్ క్యాడెట్లు పాల్గొన్నారు.



Comments