సాయి కుటీర్ రోడ్డు వి.వి.యెన్ కాలనీలో గడప గడప
- VOICE OF HERALD

- Nov 5, 2022
- 1 min read
సాయి కుటీర్ రోడ్డు వి.వి.యెన్ కాలనీలో గడప గడప

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు
సంక్షేమ ఫలాలు ప్రతి పేదవాడికి దక్కాలన్నదే జగన్ ప్రభుత్వ లక్ష్యం అని ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతి పరిధిలోని సాయి కుటీర్ రోడ్డు వి.వి.యెన్ కాలనీ నందు ఎమ్మెల్యే రాచమల్లు పర్యటించారు. కాలనీలోని ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకగా సర్పంచ్ మోషే, ఉప సర్పంచ్ రఘవ రెడ్డి, ఎంపీటీసీ భూసం రవీంద్రనాధ్ లు ఆయన వెంట నడిచి ప్రతి గడపను పలకరించి సంక్షేమ పధకాల అమలు తీరును అడిగి తెలుసుకొని, సాంకేతిక కారణాల వలన సంక్షేమ పధకాలు అందని లబ్ధిదారులకు పధకాల యొక్క తీరూతెన్నూ వివరించారు. కాగా సంక్షేమ పధకాలు ప్రతి పేదవాడికి అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యంగా ఆయన పేర్కొన్నారు. అనంతరం సచివాలయ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు
కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ యాదవ్, హౌస్ బిల్డింగ్ సొసైటీ చైర్మన్ డి. భాస్కర్ రెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ మారుతీ ప్రసాద్, బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రజినీ, ఆచార్యుల కాలనీ శివారెడ్డి, పలువు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ లోని ప్రజలు పాల్గొన్నారు.




Comments