top of page

వెంకట సుబ్బరాజు కుటుంబానికి చెవ్వు పరామర్శ.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Nov 4, 2023
  • 1 min read

వెంకట సుబ్బరాజు కుటుంబాన్ని పరామర్శించిన చెవ్వు శ్రీనివాసులు రెడ్డి

చిట్వేలి మండల పరిధిలోని భాకరాపురం కొత్తపల్లి వద్ద బుధవారం బస్సు మోటార్ బైక్ ఢీకొన్న దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వెంకట సుబ్బరాజు కుటుంబాన్ని, గాయపడ్డ కనకరాజు ను శనివారం ఉదయం వైసిపి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అన్ని విధాల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. విలువైన వ్యక్తి నీ కోల్పోయామని విచారం వ్యక్తం చేశారు. తదుపరి ఎం రాచపల్లికి వెళ్లే ప్రారంభ రహదారి విస్తరణ కు ఉన్న అడ్డంకులను సంబంధిత అధికారులతో చర్చించి జెసిపి తో తొలగించే ఏర్పాట్లు చేశారు. వేగనిరోధక సూచీలను ఏర్పాటు చేయించారు.


రోడ్డు అడ్డంకులను తొలగించేందుకు సూచనలు ఇస్తున్న చెవ్వు

మండల కన్వీనర్ తో పాటు ఈ కార్యక్రమంలో చిట్వేలు గ్రామ ఉపసర్పంచ్ వైసిపి నాయకులు చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డి, వైసిపి రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు,కనీస వేతనాల బోర్డు మెంబర్ మలిశెట్టి వెంకటరమణ, వైసిపి నాయకులు భాస్కర్ రెడ్డి బి కొత్తపల్లి, ఎం రాచపల్లి గ్రామం ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page