top of page

డిసెంబర్ 9 లోగా ఓటరు నమోదు పూర్తి చేయాలని - తహసిల్దార్ సత్యానంద

  • Writer: EDITOR
    EDITOR
  • Dec 1, 2023
  • 1 min read

డిసెంబర్ 9 లోగా ఓటరు నమోదు పూర్తి చేయాలని - తహసిల్దార్ సత్యానంద

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మార్వో

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సూచనల మేరకు డిసెంబర్ 9తేదీ లోగా ఓటరు నమోదు పూర్తి చేయాలనీ బూత్ లెవెల్ ఆఫీసర్ లకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు రేపు మీ బూత్ పరిధి లోని ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించి ఏవైనా తప్పులు ఉన్న, మార్పులు - చేర్పులు చేయవచ్చు అని వారికి తెలియజేయాలని అన్నారు. అలాగే 2004 ముందు పుట్టిన వారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు అని తాసిల్దార్ సత్యానంద తెలిపారు. అలాగే ఏవైనా బూతులు మార్పులు జరిగి ఉంటే వాటిని బిఎల్వోల దగ్గరకు వెళ్లి తమ అభ్యంతరాలు తెలపాలని , వాటిని వీలైనంత త్వరలో సరిచేసుకొని తమ ఓటును చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ మోహన్ కృష్ణ, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుశీల్ కుమార్, విఆర్వోలు, బిఎల్వోలు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page