top of page

స్వచ్చంద సేవకులకు వివేకానంద సేవారత్న పురస్కారాలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 5, 2022
  • 1 min read

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


అంతర్జాతీయ స్వచ్చంద సేవకుల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక శ్రీ రాజరాజేశ్వరి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో వివేకానంద ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేడు జిల్లా వ్యాప్తంగా పలువురు స్వచ్చంద సంస్థల సేవకులను గౌరవ సన్మానం ఏర్పాటు చేసి వివేకానంద సేవారత్న పురస్కారాలను అందచేశారు. ఈ సందర్భముగా పలువురు వక్తలు మాట్లాడుతూ, సేవే మార్గంగా ఎంచుకున్న వారు చేస్తున్న సేవలు అభినందించదగ్గ విషయం అని, ఏ స్వార్ధం ఆశించక పలు సంఘాలు, ఎన్.జి.ఓ ల ద్వారా గత కొద్దీ సంవత్సరాలుగా చేస్తున్న సేవలను గుర్తించి నేడు వారిని సత్కరించి పురస్కారాలు అందించటం ఎంతో సంతోషంగా ఉన్నదని, స్వామి వివేకానంద స్పూర్తితో తాము అందిస్తున్న సేవా పురస్కారాలు అందుకున్న ప్రతి ఒక్కరు మానవతా దృక్పదంతో సమాజానికి తమవంతు కృషి చేసిన వారు కావటం గమనార్హం అని పేర్కొన్నారు. విద్యార్థులు యుక్తవయసు నుండే సేవ వైపు అడుగులు వేసి సమాజం పట్ల గౌరవంగా మెలగాలని, పలువురు సేవకులను ఆదర్శంగా తీసుకొని కోపం, ద్వేషం విడనాడి తమవొంతు భాద్యతలను సమాజంలో నిర్వర్తించాలని హితువు పలికారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page