top of page

ప్రజా సమస్యలపై సత్వర చర్యలు - రాచమల్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 9, 2023
  • 1 min read

వై.వైస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


గురువారం ఉదయం స్థానిక కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని వివేకానంద కాలనీలో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, 15వ వార్డు మెంబర్ కే. సుమలత, ఇన్చార్జి సుమంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేకానంద కాలనీలో మురుగునీటి సమస్య, ఇంటికి అతి సమీపాన విద్యుత్ స్తంభాలు ఉండటం చేత విద్యుత్ తీగలు తెగిపడుతున్నాయని వాటిని తొలగించాలని ప్రజలు కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే రాచమల్లు కాలనీలోని ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో కొత్తపల్లి పంచాయితీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, ఆప్కాబ్ చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీ రాజారాం రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ కొనిరెడ్డి సుబ్బారెడ్డి, పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, కాకర్ల నాగశేషా రెడ్డి, రాయపు రెడ్డి, నాటక మండలి డైరెక్టర్ బండారు సూర్యనారాయణ, గజ్జల కళావతి, గుమ్మల పద్మ, 15వ వార్డు ఇన్చార్జి సుమంత్, జంగమయ్య, యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, కుండా వెంకటేశు, పంచాయతీ సెక్రెటరీ గురు మోహన్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు లోని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page