స్పందన ఆధ్వర్యంలో వివేకానందుని విగ్రహానికి పూల మాల అలంకరణ
- VOICE OF HERALD

- Jan 12, 2022
- 1 min read
కడపజిల్లా, ప్రొద్దుటూరు, స్వామి వివేకానంద 159 వ జయంతి సందర్భంగా స్థానిక కొర్రపాడు రోడ్డు లోని శ్రీ వివేకానంద హోల్సేల్ క్లాత్ మార్కెట్ ప్రాంగణంలోనీ స్వామి వివేకానంద విగ్రహానికి స్పందన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు స్పందన సుబ్బరామిరెడ్డి అధ్యక్షులు అగస్తేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ స్పందన రాంప్రసాద్ రెడ్డి సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి కాంట్రాక్టర్ మాచి రెడ్డి రాజగోపాల్ రెడ్డి యోగా గురువు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పి నరేంద్రనాథ రెడ్డి స్పందన ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పర్యావరణ మిత్ర రచయిత గజ్జల వెంకటేశ్వర రెడ్డిలు పూల మాల అలంకరించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్పందన రాంప్రసాద్ రెడ్డి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి లు మాట్లాడుతూ స్వామి వివేకానంద నాటితరం నేటితరం భవిష్యత్ తరాల వారికి ఆదర్శనీయుడని గతవైభవ భారతిని దర్శించిన మహనీయుడు అని వివేకానందుని బోధనలు మనిషి ఉన్నతికి సమాజ హితానికి ఉత్తమ సమాజ నిర్మాణానికి దోహద పడతాయని భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప దేశభక్తుడని యువత తప్పని సరిగా వివేకానందుని బోధనలను చదివి ఆచరించి బావి సమాజ నిర్మాతలుగా ఎదగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్పందన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Comments