top of page

కడప, ప్రొద్దుటూరులో విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంటు విభాగం మమ్ముర దాడులు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 11, 2022
  • 1 min read

విజిలెన్సు & ఎన్ఫోర్స్మెంటు విభాగం మమ్ముర దాడులు. వంట నూనెల అధిక ధరలపై కొరడా. వ్యాపారస్థులపై మరో 25 పైగా కేసులు, వంట నూనెల అధిక ధరలపై ఆయిల్స్ దుకాణాలు మరియు మిల్లులపై కొనసాగుతున్న విజిలెన్సు దాడులు. 11-03-2022 శుక్రవారం కడప, విజిలెన్సు మరియు ఎన్ఫోర్స్మెంటు విభాగపు రీజినల్ విజిలెన్స్ అధికారి బి. ఉమామహేశ్వర్ పర్యవేక్షణలో విజిలెన్సు విభాగపు టీములు కడప జిల్లా వ్యాప్తంగా ప్రొద్దటూరు మరియు కడప పట్టణాలలో దాడులు నిర్వహించడం జరిగింది. పట్టణాలలో దుకాణాలు, మిల్లులు మరియు సీడ్ గొడౌన్స్ పై మమ్ముర తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు వంట నూనె అమ్ముతున్నటువంటి వ్యాపారస్తులు ఇతర అక్రమాలకు పాల్పడుతున్న వారి మీద 25 కేసులు నమోదు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 116 వ్యాపార విభాగాల మీద దాడులు నిర్వహించి 64 కేసులు నమోదు చేయడం జరిగింది.


ఈ సందర్భముగా కడప, రీజినల్ విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంటు అధికారి బి. ఉమామహేశ్వర్ మాట్లాడుతూ వ్యాపారస్థులు వంట నూనె ధరల విషయంలో నియమ నిబంధనాలు పాటించాలని, అక్రమాలకు పాల్పడరాదని హెచ్చరించారు. ఇటువంటి

దాడులు ఇక కొనసాగుతూనే ఉంటాయి అని తెలిపారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page