top of page

శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 10, 2022
  • 1 min read

తిరుమల, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేడు సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీవారిని దర్సించుకోవడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు, ప్రాతఃకాలాన స్వామివారిని కుటుంబ సమేతంగా దర్సించుకున్న వెంకయ్య నాయుడు స్వామి దర్సనంతో లభించిన సంతృప్తి, సంతోషంతో ప్రజలకు మరింత సేవ చేసే భాగ్యం లభిస్తుందని భావిస్తున్నానని, తిరుమలకు ఎన్నిసార్లు వచ్చినా నిత్య నూతన ఉత్సాహం కలుగుతూ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు తిరుమల శ్రీవారిని దర్సించుకోవాలని హిందూ ధర్మ పరిరక్షణ, భారతీయ సాంప్రదాయాలను కొనసాగిస్తూ ప్రపంచానికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉంది అని అభిప్రాయ పడ్డారు. తన మనుమరాలు సుష్మ వివాహానికి హాజరవ్వడానికి తిరుమల వచ్చానని అయితే పుష్పగిరిమఠంలో సాదాసీదీగా తన మనుమరాలు వివాహం జరుగనుంది అని తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page