top of page

ఘనంగా వైసీపీ మునిసిపల్ వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 5, 2022
  • 1 min read

ఎమ్మెల్సీ చేతుల మీదుగా ఘనంగా వైసీపీ మునిసిపల్ వైస్ చైర్మన్ జన్మదిన వేడుకలు...

కడప జిల్లా, ప్రొద్దుటూరు పురపాలక సంఘం వైసీపీ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా జన్మదిన వేడుకలను, ఈరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ప్రొద్దుటూరులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, వైసీపీ కౌన్సిలర్లు, అభిమానులు, ఆయిల్ మిల్ ఖాజా ఇంటి వద్దకు చేరుకుని ఆయన్ని పూల మాలతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో మునిసిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా కేక్ కట్ చేశారు. అభిమానులు మునిసిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజాకు ఆయన చిత్రపటాన్ని బహుకరించారు.

కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నడుపుతున్న కొనిరెడ్డి ఫౌండేషన్ వద్దకు చేరుకుని అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ భోజనం చేస్తున్నవారితో ఎమ్మెల్సీ, మునిసిపల్ వైస్ చైర్మన్, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి లు మాటమంతి జరిపారు. తమ ఆప్త మిత్రుడు మునిసిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా జన్మదిన సందర్భంగా 19 వార్డ్ వైసీపీ కౌన్సిలర్ షేక్ మునీర్ ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి నందు ఉన్న పేషెంట్స్ కు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం వాత్సల్య చారిటబుల్ ట్రస్ట్ నందు అనాధ పిల్లలకు భోజన కార్యక్రమం నిర్వహించారు. అక్కడి పిల్లలతో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, వారికి ఎల్లపుడు అండగా ఉంటామని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మునిసిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా భరోసా ఇచ్చారు.

అనంతరం మదర్సా నందు ఉన్న పిల్లలతో కలిసి మునిసిపల్ వైస్ చైర్మన్ ఖాజా భోజనం చేశారు. మత గురువుల ఆశీర్వచనాల మధ్య మునిసిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ప్రసాద్, వైసీపీ కౌన్సిలర్లు మహమ్మద్ గౌస్, వంగనూరు మురళీధర్ రెడ్డి,19-మునీర్, రఘునాథరెడ్డి, ప్రసాద్, మాజీ ఎంపిటిసి భాస్కర్, మనోహర్,లిబర్టీ గైబుసా, పాలగిరి అహమ్మద్, మహమ్మద్ ఇద్రిస్, వైసీపీ మైనారిటీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page