top of page

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 30, 2021
  • 1 min read

రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు... వాహనదారులు ఆందోళన


అమరావతి: రవాణాశాఖ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా షోరూంలలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 1 నుంచి రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ల ఛార్జీలు పెరగనున్నాయి. ఈనేపథ్యంలో.. అంతకు ముందే వాహనాలు కొనేందుకు వాహనదారులు ప్రయత్నిస్తున్నారు. వాహనం డెలివరీ చేయకపోవడంతో పలు చోట్ల వినియోగదారులు డీలర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. రేపటికల్లా వెబ్‌సైట్‌ లో సాంకేతిక సమస్య పరిష్కరిస్తామని రవాణాశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. రేపు ఉదయం నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page