top of page

జయంతి రోజున వాసవి మాతకు ప్రత్యేక పూజలు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 11, 2022
  • 1 min read

వాసవి మాత జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు.

--ప్రత్యేక ముగ్గులు పూజలు నిర్వహించిన మహిళలు.


ఈరోజు వాసవిమాత కన్యకా పరమేశ్వరి అమ్మవారు జయంతి సందర్భంగా చిట్వేలు మండల పరిధిలోని ఆర్యవైశ్య మహిళలు అమ్మవారికి రంగవల్లులతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలను నిర్వహించారు.

వేకువజాము నుంచే ఆలయ అర్చకులు అభిషేకాలు అలంకరణ చేసి ధూప దీప నైవేద్యాలను సమర్పించి భక్తులందరికీ తీర్థప్రసాదాలను పంచిపెట్టారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కమిటీ సభ్యులు టివి సుబ్రహ్మణ్యం, కోటా సుధాకర్, తాళ్ళపాక రాజా,బొంతల నాగేశ్వరరావు, కర్ణాటక సుబ్రహ్మణ్యం, కామిశెట్టీ సుమన్ కుమార్ మరియు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page