ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వనుం సత్యకళ్యాని
- VOICE OF HERALD

- Mar 8, 2022
- 1 min read
తూర్పు గోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ప్రముఖ మహిళా నేత, రాష్ట్ర శెట్టిబలిజ సేవాదళ్ ప్రముఖ మహిళా నాయకురాలు వనుo సత్య కళ్యాణి మాట్లాడుతూ, ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా, ప్రతి ఒక్క మహిళామూర్తికి, అక్క చెల్లెమ్మలకు, ఆడపడుచులకు, అన్ని వర్గాలలో ఉన్న ప్రతి మహిళాతల్లులకు, ఆడబిడ్డలకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు! తెలియజేయుచున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లోనూ, పెద్దపీట వేస్తూ ఎంతో గొప్పగా మహిళలను ముందుకు తీసుకువెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈరోజు ప్రపంచ మహిళ దినోత్సవ సందర్భంగా చల్లని తల్లి, వైఎస్ఆర్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ వారికి, ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరు, ఆడబిడ్డలను, మహిళలను, మాతృ మూర్తులను గౌరవించాలని, ప్రతి ఒక్కరు మహిళలను కంటికి రెప్పలా కాపాడాలని, ఎంతో ఆత్మీయతతో మహిళల పట్ల కుటుంబ సభ్యులగా బాంధవ్యాలతో కలిసి, మెలిసి, సొంత కుటుంబ సభ్యుల వలే చూడాలని, భావించాలని కోరుతున్నాను.




Comments